నిఖిల్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

Will Nikhil's following sentiment work out,

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ సినీ ఇండస్ట్రీ అయినా.. సెంటిమెంట్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన దగ్గర్నుండి ఫైనల్ ప్యాకప్ చెప్పే వరకు అన్నీ సెంటిమెంట్ ప్రకారం జరుగుతుంటాయి. అయితే సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా పలు సెంటిమెంట్స్ ని స్టార్ హీరోలు ఫాలో అవుతారు. కానీ ఇక్కడ నిఖిల్ సెంటిమెంట్ ను ఫాలో అవ్వకుండా తన సినిమాలనే ఓ సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నారని టాక్ వినిపిస్తుంది.

నిఖిల్ యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ వైజ్ గా చూస్తే.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటే అంత హిట్ అయ్యాయి. 2014 లో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ మూవీ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ కూడా నోట్ల రద్దు టైమ్ లో రిలీజ్ అయ్యి పలు రకాల ఇబ్బందుల్ని ఎదుర్కుంది. కానీ మూవీ కంటెంట్ బావుంది. దాంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు నిఖిల్.

నెక్ట్స్ 2019 లో వచ్చిన అర్జున్ సురవరం మూవీ కూడా కొన్ని ఇబ్బందులు పడింది. ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా అని కూడా అభిమానులు ఆందోళన చెందారు. ఈ సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా కార్తికేయ 2 మూవీ కూడా పలు ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది. దీంతో ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటుందని నిఖిల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రమోషన్స్ లో భాగంగా హీరో నిఖిల్ ఈ సినిమా కంటెంట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేనా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంది.