పుష్ప 2 లోకి మరో బాలీవుడ్ నటుడు ఎంట్రీ ఇవ్వనున్నారా?

Will another Bollywood actor make an entry into Pushpa 2,

ఐకాన్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ఫ సినిమాతో తన సత్తా చాటుకున్నారు. అల్లు అర్జున్ యాక్టింగ్ ను చూసి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా మెస్మరైజ్ అయ్యారు. ప్రజంట్ పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఫుల్ బిజీగా మారారు. పుష్ప 2 పై ఇప్పుడు క్రేజీ బజ్ ఒకటి వినిపిస్తుంది. పుష్ప 2 లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ కోసం క్యారెక్టర్ ను సెట్ చేసే పనిలో ఉన్నారు. బాలీవుడ్ సీనియర్ సునీల్ శెట్టి ఈ మూవీలో నటించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ పీక్స్ కు చేరింది.

పుష్ప రాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. నిజానికి ఈ సినిమాకు ఇంతటి హైప్ తీసుకురావడానికి అల్లు అర్జున్ చాలా రిస్కులే చేశారు. ముఖ్యంగా సమంత స్పెషల్ సాంగ్, రష్మిక డీ గ్లామర్ రోల్ యాక్టింగ్ తో ఎంతో ఆకట్టుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ తో ప్రేక్షకులను మెప్పించారు.

పుష్ప 2 ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈయన పాత్ర పుష్ప 1 లో అంతగా లేకపోయినా.. సెకండ్ పార్ట్ లో పీక్స్ లో ఉంటుందనేది సమాచారం. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ యాక్టింగ్ తగ్గెదెలే అనేలా చేశారు. ఈ క్రమంలో పార్ట్ 2 పై అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.