అందుకే శ్రీదేవి, జాన్వీని ఇండస్ట్రీలోకి రావద్దని చెప్పిందట!

That is why she told Sridevi and Janhvi not to enter the industry

సినీ ఇండస్ట్రీలోకి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. కానీ హిట్స్ మాత్రం దక్కడం లేదు. అయితే తాను ఫస్ట్ నుండి నటనకు ప్రాధాన్యత ఉన్న స్టోరీస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయితే ఆమెకు బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉండటంతో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కరణ్ జోహార్ తన బ్యానర్ లో జాన్వీకి ఓ మూవీ ఆఫర్ చేశారు. అయితే తాను మాత్రం ఇండస్ట్రీలో మంచి హిట్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఇక రీసెంట్ గా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పిన విషయాల్ని షేర్ చేసుకున్నారు. ఫస్ట్ లో జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి వెళ్తా అన్నప్పుడు శ్రీదేవి ఒప్పుకోలేదట. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు.. ఎన్నో సవాళ్లు ఉంటాయని వాటిని తట్టుకుని నిలబడాలని అన్నారు. అయినా.. కూడా జాన్వీ కపూర్ కు యాక్టింగ్ అంటే ఇష్టం పెరిగి.. పట్టువదలకుండా యాక్టింగ్ అంటే ఇష్టం అని వాళ్ల అమ్మ సపోర్ట్ చేశారని జాన్వీ కపూర్ తెలిపింది. అయితే ఫస్ట్ జాన్వీ కపూర్ దడక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా కారణం శ్రీదేవి అని అన్నారు.

ఆమెను గ్రాండ్ గా బాలీవుడ్ లోకి తీసుకురావాలని శ్రీదేవి ప్రయత్నాలు చేశారని, ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. ఇక ప్రజంట్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ప్రాజెక్ట్స్ తో పాటు సౌత్ ఇండియా వైపు కూడా చూస్తుంది. సౌత్ లో సినిమా అవకాశాలు వస్తే అస్సలు వదులుకోను అని కూడా చెప్పింది. ఇక అతి త్వరలోనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.