తీస్ మార్ ఖాన్ ట్రైలర్.. హిట్ కోసం ఆది ప్రయత్నాలు

Tees Maar Khan Trailer,

ఆది సాయి కుమార్ హీరోగా హిట్ అందుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా తీస్ మార్ ఖాన్ అనే మూవీతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. తీస్ మార్ ఖాన్ సినిమాకు కళ్యాణ్ జి గోగణ డైరెక్షన్ వహిస్తున్నారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో ఆది సరసన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. సునీల్, పూర్ణలు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది. స్టూడెంట్ గా కా గబ్బర్ సింగ్ స్టైల్ లో రౌడీ పోలీస్ గా విపరీతమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించారు. పోలీస్ గా ఆది వండర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ను అందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను చేసినట్లు తెలుస్తుంది. తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు. వారి ఆట ఎలా కట్టించారనే తీస్ మార్ ఖాన్ ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.

ఈ సినిమాలో హీరోహీరోయిన్ల రొమాన్స్ కూడా పీక్స్ లో ఉంటుంది. కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ విలన్స్ గా కనిపించగా, శ్రీకాంత్ అయ్యంగార్, హేమంత్ ఇతర పాత్రల్లో నటించారు. తీస్ మార్ ఖాన్ అనేది పక్కా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అని తెలిపారు. ఈ సినిమా ఆది వన్ మ్యాన్ షోగా కనిపిస్తుంది. ఆగస్ట్ 19 న థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయి కుమార్ ఖాకీ ధరించి అనేక సక్సెస్ లు అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో ఆది సాయికుమార్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.