హీరో సూర్య నోటి వెంట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ..

Suriya Interesting Comments On RC15 Movie,

స్టార్ హీరో సూర్యకు సౌత్ ఇండియాలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. రీసెంట్ గా విక్రమ్ సినిమాలో నటించిన రోలెక్స్.. ఐదు నిమిషాల పాత్రతో వరల్డ్ వైడ్ గా ఫేమ్ సంపాదించుకున్నారు. ఇక లేటెస్ట్ గా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇక ఆయన యాక్టింగ్ కు ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.

రీసెంట్ గా హీరో సూర్య మాట్లాడుతూ.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా గురించి రెస్పాన్డ్ అయ్యారు. ఇక సూర్య మాట్లాడిన మాటలకు రామ్ చరణ్ అభిమానులు ఫిదా అవుతున్నారు. కోలీవుడ్ మూవీ విరుమన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ శంకర్, హీరో సూర్యలు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. రామ్ చరణ్ మూవీ గురించి మాట్లాడారు. మన దేశం గర్వించదగిన డైరెక్టర్ శంకర్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, చరణ్ సినిమా కోసం తెలుగు, తమిళం అభిమానులే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని అన్నారు.

సూర్యలాంటి హీరో రామ్ చరణ్ మూవీ గురించి మాట్లాడటంతో మెగా అభిమానులకు ఎంతో ఆనందానికి గురిచేసింది. ఇక హీరో సూర్య గురించి రామ్ చరణ్, చిరంజీవిలు ఎన్నో సందర్భాల్లో పొగిడిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఇండియాన్ 2 మూవీ గురించి మాత్రం సూర్య మాట్లాడలేదు. దీంతో కోలీవుడ్ లో పలు రకాల డౌట్స్ వస్తున్నాయి. అంటే శంకర్ ను కోలీవుడ్ తక్కువ అంచనా వేస్తుందా అనే డౌట్స్ కి సూర్య మాటలు మరింత బలం చేకూరిందా అనేలా డౌట్స్ వస్తున్నాయి. మరి శంకర్ మూవీస్ తెలుగు సినిమాలకు డైవర్ట్ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే శంకర్ తెరకెక్కించే ఇండియాన్ 2 మూవీ రిలీజ్ అవ్వాల్సిందే.