సుదీప్ ‘విక్రాంత్ రోణా’ మూవీ రివ్యూ

Sudeep Vikrant Rona Movie Review,

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ విక్రాంత్ రోణా. బాలీవుడ్ నటి జాక్వలీన్ ఫెర్నాండజ్, నీతా అశోక్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనుప్ భండారి డైరెక్షన్ వహించారు. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

కోమరట్టు అనే గ్రామంలో ఆ ఊరు ఇన్ స్పెక్టర్ చనిపోతాడు. అతని ప్లేస్ లో కొత్త ఇన్ స్పెక్టర్ విక్రాంత్ రోణా వస్తాడు. మరో వైపు ఆ గ్రామంలో వరుసగా పిల్లలు చనిపోతూ ఉంటారు. ఆ పిల్ల్ని ఎవరు చంపుతున్నారు.. విక్రాంత్ రోణా ఈ గ్రామానికే ఎందుకు వచ్చారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులు దగ్గర కిచ్చా సుదీప్ విక్రాంత్ రోనా పాత్రలో అద్భుతంగా నటించారు. కోమరట్టు అనే గ్రామంలో వరుసగా పిల్లలు చనిపోతున్న టైమ్ లో అక్కడకి పోలీస్ గా వచ్చిన సుదీప్ పాత్ర ఆకట్టుకుంటుంది.

సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ లో సుదీప్ నటన సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా తెలుస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ టేకింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. పీరియాడికల్ డ్రామాకు సంబందించి మెయిన్ పాయింట్ బావున్నా.. స్క్రీన్ ప్లే మాత్రం ఇంట్రెస్ట్ గా అనిపించవు. అవసరానికి మించి ఎలివేషన్ సీన్స్ ఎక్కువయ్యాయి.

యాక్షన్ సీన్స్ కూడా డ్రమటికల్ గా సాగాయి. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. డైరెక్టర్ అనూప్ భండారి యాక్షన్ సీన్స్ లో విజువల్స్ పరంగా మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ మూవీలో కొన్ని కీలక పాయింట్స్ హైలెట్ చేస్తున్నాయి. సింపుల్ గా మూవీలో సరైన ఫ్లో మిస్ అవ్వడం లాంటి పాయింట్స్ రిజల్ట్ ను ఫెయిల్ చేశారు.