శ్రీ విష్ణు ‘భళా తందనాన’ సినిమా రిలీజ్ వాయిదా

Sree Vishnu Bhala Thandanana movie release postponed,

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, కేథరిన్ లు జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భళా తందనాన. ఈ సినిమాను చైతన్య దంతులూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించారు. రీసెంట్ గా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ను ఫిల్మ్ టీమ్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఆచార్య మూవీకి రిలీజ్ అయిన నెక్ట్స్ డే న రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఆచార్య సినిమాకు పోటీ ఇవ్వలేమని భావిస్తున్న ఫిల్మ్ టీమ్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ముందుగా ప్రకటించినప్పుడు ప్రేక్షకులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మరికొంతమంది ఆచార్యకు పోటీగా రిలీజ్ చేయడంలో ధైర్యం ఉందంటూ పొగిడారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రజంట్ ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని అన్నారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

చిరంజీవి ఆచార్య సినిమా టాక్ తో కాకుండా ఈ సినిమా రెండు వారాల పాటు నాన్ స్టాప్ హవాతో కలెక్షన్లు రాబడుతుందనే విషయం ఖరారు అవుతుంది. థియేటర్లు కూడా హౌస్ ఫుల్ అవుతాయని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఇలాంటి సిట్యూవేషన్స్ మధ్య శ్రీ విష్ను నటించిన భళా తందనాన సినిమాను రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని భావించినట్లు సమాచారం. ఆచార్య సినిమాకు పోటీగా తమ సినిమా విడుదల వద్దనుకున్నట్లుగా భళ తందనాన ను వాయిదా వేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. శ్రీవిష్ణు సినీ కెరీర్ లో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లు, వీడియోలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తుంది.