హాఫ్ మిలియన్ కు చేరుకున్న సీతారామం యూఎస్ కలెక్షన్లు

Sita Ramam US collections reached half a million,

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఫుల్ క్రేజ్ దక్కింది. హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో రష్మిక మందన్న నటించారు. కాగా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో మంచి సక్సెస్ కలెక్షన్లను రాబట్టింది. ఒక్క నైజాంలోనే 4 కోట్లు దక్కించుకుంది.

రీసెంట్ గా ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కు ఇదే నిదర్శనం అని చెప్పాలి. రానున్న రోజుల్లో సీతారామంకు మరిన్ని కలెక్షన్లను దక్కించుకుంటుందని నిపుణులు అంటున్నారు. రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్, ప్రకాష్ రాజ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను దాటింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు తారా స్థాయికి చేరుతాయనే విషయం స్పష్టం అవుతుంది.

యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకున్న సినిమా సీతారామం. ఈ క్రేజ్ ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే మూడు నాలుగు రోజుల్లో సినిమా 1 మిలియన్ డాలర్లు దాటడం సులువు అవుతుంది. ఈ సినిమా స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. కాగా మరింత ఇంట్రెస్ట్ తో సాగిన లవ్ స్టోరీ. కాగా డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం సినిమాను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించారు. ఎన్నో భావోద్వేగాలతో కూడిన ఈ సినిమాపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.