సీతారామం మూవీ రివ్యూ

Sita Ramam Movie Review,

దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఆర్టీలో రామ్ వర్క్ చేస్తుంటాడు. కశ్మీర్ లో తన ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేస్తాడు. ఈ మిషన్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తానొక అనాథ అని చెప్తాడు. అప్పటి నుండి రామ్ కు ఉత్తరాలు రావడం, ఓ అమ్మాయి నీ భార్య సీతామహాలక్ష్మీ అంటూ లెటర్స్ రాస్తుంది. మరి ఆ సీతామహాలక్ష్మీ ఎవరు. రామ్ సీతల కథకు రష్మిక పాత్రకు సంబంధం ఏంటి.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆర్మీ నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా. ఈ స్టోరీ మొత్తం ప్రేక్షకులకు ఓ వినూత్నమైన అనుభవాన్ని అందిస్తుంది. పాత్రలు, వాటి అనుభవాలు పరిచయం చేసే విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సీత, రామ్, ఆఫ్రిన్ ల పాత్రలు కీలకంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగినా.. సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేస్తుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలిచాయి. కథలో డెప్త్ ఎంతో అందంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ సినిమాలో కీలకంగా నిలిచిన ప్రతి ఒక్కరి పాత్ర సినిమాకు హైలెట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామ్ రాసిన లెటర్ ను సీతకు హీరోయిన్ రష్మిక చేరుస్తుందా లేదా అనే ఓ ముఖ్యమైన పాయింట్ తో సినిమా డెప్త్ కు వెళ్తుంది.

ఈ క్రమంలో కథతో పాటు ప్రేక్షకుడు కూడా ట్రావెల్ చేయడంతో సినిమాలో లీనం అవుతాడు. ముఖ్యంగా ఓ కథకు కావాల్సిన బలమైన పాయింట్స్ ను టచ్ చేయడంతో ఈ సినిమాకు బలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రామ్, సీతల కెమిస్ట్రీ, లవ్ స్టోరీ ఎంతో అందంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ మాత్రమే చేస్తుందా అనేలా వర్కవుట్ అయ్యింది. అలాగే కథ, కథనంతో పాటు సెకండాఫ్, పాటలు. మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ లో ఓ ఫీల్ గుడ్ సినిమా అంటే అది సీతారామం అనిపించేలా సాగింది.