టికెట్ రేట్ల పెంపుపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్

Sensational comments by Chiranjeevi on the increase in ticket rates,

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 29 న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఆచార్య మూవీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, చిరంజీవి, కొరటాల, పూజా హెగ్దేలు పాల్గొన్నారు.

చిరంజీవి సినిమా అంటే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటిది ఆచార్య మూవీకి టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం ఉందా అని విలేఖరి ప్రశ్నించగా.. కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం చిరంజీవి గారు మూడేళ్లు కష్టపడ్డారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ నుండి పర్మిషన్ తో వచ్చి మరీ వర్క్ చేశారు. తాను నాలుగేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పై పనిచేశానని, ప్రతి సినిమాకు ఓ బడ్జెట్ ఉంటుందని, ఆ బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్ ఫిక్స్ చేస్తారని, అంతేగానీ ఇష్టానుసారం టికెట్ రేట్లు పెంచడం కుదరదని అన్నారు.

ఈ ప్రశ్నకు చిరంజీవి రెస్పాన్డ్ అవుతూ.. పాండిమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలాగే సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే.. ఎంతో వినోదాన్ని ఇచ్చారు. మనం కూడా ఓ పది రూపాయలు ఇద్దామని ప్రేక్షకులు కూడా అనుకుంటారని, ఇది అడుక్కుతినడం కాదు.. వినోదాన్ని అందించే ప్రయత్నంలో అనుకోకుండా వడ్డీలు అయ్యాయని అన్నారు.

ప్రపంచంలో అన్ని రంగాలతో పాటు తాము కూడా నష్టం పోయామని, ప్రభుత్వాల దగ్గర వేడుకోవడం తప్పేమి లేదని అన్నారు. ఈ సినిమాలో ఇప్పటికే కాజల్ ను తొలగించినట్లు కొరటాల శివ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పూజా హెగ్దే నీలాంబరి పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సిద్ధ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.