భీమ్లా నాయక్ నుండి సెకండ్ సాంగ్ ప్రోమో అప్డేట్

Second song promo update from Bheemla Nayak

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్, సింగిల్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. ఎస్ ఎస్ తమన్ అందిస్తున్న మ్యూజిక్ తో మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా నుండి మరో అల్టిమేట్ అప్డేట్ ను రిలీజ్ చేస్తారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ఈ మూవీ నుండి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రోమో కి సంబంధించి హింట్ ను కూడా ట్రాక్ లో పెట్టేశారు. అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని ఎస్ ఎస్ తమన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. సాంగ్ ప్రోమో లోడింగ్ అంటూ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ పోస్టర్ ను జత చేసి పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భీమ్లా నాయక్ నుండి రిలీజ్ అవ్వబోయే సెకండ్ సాంగ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.