విలక్షణ నటుడు సత్యదేవ్ కృష్ణమ్మ టీజర్ రిలీజ్

Satyadev Krishnamma Teaser Release,

టాలీవుడ్ విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు హీరో సత్యదేవ్. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు సినిమాలతో సత్యదేవ్ సినిమాలంటే స్పెషల్ అనే ముద్ర వేయించుకున్నారు. రీసెంట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో గాడ్సే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. అయితే ఆయన నటించిన ఈ మూవీ కమర్షియల్ హిట్ ను అందుకోలేదు.

ఇక ఇప్పుడు సత్యదేవ్ హీరోగా వివి గోపాలకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న రీసెంట్ మూవీ కృష్ణమ్మ. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ లో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీపై స్పెషల్ ఇంటెన్స్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రీసెంట్ గా ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేయగా, స్పెషల్ ఇంట్రెస్ట్ ను ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను త్వరలో థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ సన్నాహాలు చేస్తుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రిలీజ్ చేస్తామని ఫిల్మ్ టీమ్ తెలిపింది.

ఇక సత్యదేవ్ హీరోగా, తమన్నా భాటియా కలిసి నటిస్తున్న గుర్తుందా శీతాకాలం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఈ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, మరి అలాంటి పాత్రలో నటుడు సత్యదేవ్ సరిపోతారని టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా షూటింగ్ లో కూడా ఇప్పటికే సత్యదేవ్ పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను హీరో సత్యదేవ్ లైనప్ లో ఉన్నాయి.