నాగ్ బర్త్ డే కి ట్వీట్ చేసిన సమంతా.. ఇకనైనా రూమర్స్ కి చెక్ పెడతారా..?

Samantha

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతా, నాగచైతన్య జోడీ అద్భుతంగా ఉంటుంది. సోషల్ మీడియాలో సామ్ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. రీసెంట్ గా ఆమె ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ లో అక్కినేని అనే పదాన్ని తొలగించి కేవలం ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచారు. దీంతో సామ్ ఎందుకు అక్కినేని అనే పదాన్ని తొలగించిందనే వార్తలు వచ్చాయి. అలాగే అక్కినేని నాగ చైతన్య, సమంతా త్వరలో విడాకులు తీసుకుంటారు అంటూ నెట్టింట్లో తెగ టాక్ వినిపించింది.

విడాకులు తీసుకుని నాగ చైతన్య సామ్ కి వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. వారి వివాహ బంధంలో ఎన్నో అవకతవకలు వచ్చాయని అందుకే ఈ జంట విడాకులు తీసుకుంటుందని సోషల్ మీడియా పలు కథనాలు వినిపించింది.

అయితే వీరి ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన లేదు. అలాగే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమంతా అక్కినేని తన సోషల్ మీడియా అకౌంట్ లో పేరు మార్చిన విషయంపై స్పందిస్తూ.. తన అభిప్రాయం తనది అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఈరోజు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సమంత తన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. నాగార్జునకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఒకవేళ ఫ్యామిలీలో ఏవైనా సమస్యలు ఉంటే సమంతా ట్వీట్ చేయరు కదా. దీంతో ఇకనైనా సామ్, చైతుల మధ్య వచ్చే పుకార్లకు చెక్ పెడితే బెటర్.