బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు

RGV harsh comments on Bollywood movie industry,

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సౌత్ ఇండియా సినిమాల హవీ నడుస్తుంది. నార్త్ సర్క్యూట్ లో వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. దీంతో పాటు సౌత్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో కౌంటర్లు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో తెలుగు, కన్నడ సినిమాలు కోవిడ్ వైరస్ లా స్ప్రెడ్ అవుతున్నాయని అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ త్వరలో వ్యాక్సిన్ తో వస్తుందని అనుకుంటున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఇక తెలుగులో నాని హీరోగా నటించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన జెర్సీ సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రీమేక్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను నమోదు చేసింది.

ఈ సినిమాలో షాహిద్ కపూర్ బెస్ట్ యాక్టింగ్ చేసినా.. ఒరిజినల్ సోల్ మిస్ అయ్యిందని, తెలుగులో మ్యాజిక్ చేసినట్లుగా చేయలేకపోయిందని కామెంట్స్ వచ్చాయి. దీనికి తగ్గట్లు ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. నాని నటించిన జెర్సీ మూవీని బాలీవుడ్ లో డబ్ చేసుంటే.. నిర్మాతలకు 10 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యేదని, అలా కాకుండా 100 వరకు నష్టం వచ్చిందని అన్నారు. జెర్సీ సినిమా డిజాస్టర్ బాలీవుడ్ కు డెత్ ఆఫ్ రీమేక్స్ అనే సైన్ అందిస్తుందని, కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి డబ్బింగ్ మూవీస్ బాలీవుడ్ ఒరిజినల్స్ సినిమాల కంటే భయంకరమైన కలెక్షన్లు సాధించాయని అన్నారు.

బాలీవుడ్ కు ప్రస్తుతం సూపర్ హిట్స్ ను ఎలా ప్లాన్ చేయాలో తెలియట్లేదని ఆర్జీవీ అన్నారు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే.. డబ్బింగ్ సినిమాలను రీమేక్ చేయడానికంటే వాటిని నేరుగా రిలీజ్ చేయడం తెలివైన పని అని, ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కడి నుండైనా నటీనటులు ఎవరైనా.. సబ్జెక్ట్ ఏదైనా ఓకే చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.