ప్రాజెక్ట్ కె మూవీ ఇండియన్ మూవీకే గర్వకారణం: దుల్కర్ సల్మాన్

Project K Movie is the pride of Indian cinema

ఒకే బంగారం, మహానటి లాంటి సినిమాలతో టాలీవుడ్ కు పరిచయం అయ్యి మంచి క్రేజ్ ను దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ సీతారామం. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి ఫిల్మ్ టీమ్ గ్రాండ్ గా ప్లాన్ చేసింది. అయితే ఈ ఈవెంట్ కు ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.

ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. వైజయంతీ మూవీస్ లాంటి ఓ పెద్ద బ్యానర్ లో ఇంత మంచి మూవీ చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నా అని అన్నారు. అలాగే తన సినిమాకు గ్లోబల్ స్టార్ ప్రభాస్ రావడం మరింత ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ గారు చేస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా మరో ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తుందని అన్నారు. ఈ మూవీ వీరిద్దరూ కలిసి చేస్తున్న ప్రయోగం అని అన్నారు.

ఇక ఈ మూవీ ఇండియన్ సినిమాకే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. సీతారామం విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం స్వప్న దత్ కష్టపడిన తీరుకు తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఇక డైరెక్టర్ హను రాఘవపూడి తన కలను నిజం చేయడానికి ఎంతైనా కష్టపడతారని అన్నారు. ఈ సినిమా కోసం ఎన్నో లొకేషన్స్ కి వెళ్లారని, తాను మరే మూవీ కోసం ఇన్ని ప్లేసేస్ కు వెళ్లలేదని అన్నారు. సీత పాత్రలో మృణాల్ అద్భుతం అని, ఆమె తప్ప ఈ పాత్రకు ఇంకెవ్వరూ చేయలేరని దుల్కర్ సల్మాన్ అన్నారు. అలాగే తమ సినిమాను థియేటర్ లో చూడాలని దుల్కర్ కోరారు.