జిన్నా మూవీలో పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రివీల్

Payal Rajput First Look Revealed in Ginna Movie,

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జిన్నా. ఇషాన్ సూర్య డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో విష్ణు నటిస్తున్నారు. రీసెంట్ గా విష్ణు ఫస్ట్ లుక్ వీడియోను ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది. అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పాత్రను రివీల్ చేశారు. ఈ మూవీలో పచ్చళ్ల స్వాతిగా నటిస్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒంటరిగా సిల్లీ పనులను చేయనివ్వని ఒక ఫ్రెండ్ కావాలి.

జిన్నా భాగస్వామి “స్వాతి”గా పాయల్ రాజ్ పుత్ ను పరిచయం చేస్తున్నాం అని టీమ్ తెలిపింది. ఈ విషయాన్ని పాయల్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో పాయల్ రెడ్ కలర్ హాఫ్ శారీలో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ గ్లామర్ రోల్స్ లో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ‘జిన్నా’ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది. ఆర్ఎక్స్ 100 మూవీతో హీరోయిన్ గా వచ్చిన పాయల్, ఫస్ట్ మూవీతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్, రవితేజలతో కలిసి యాక్ట్ చేసింది. ఆ తర్వాత చిన్న సినిమాల్లో యాక్ట్ చేసినా ఆశించినంత క్రేజ్ రాలేదు. మరి ఇప్పుడు జిన్నా మూవీతోనైనా ఆమెకు బ్రేక్ వస్తుందా అనేది చూడాలి.

జిన్నా సినిమాను మంచు అవ్రమ్ భక్త ప్రొడక్షన్ లో ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మంచు విష్ణు ఈ సినిమాతో పాటు ఢీ సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు మంచు విష్ణు రెడీ అవుతున్నారు.