సూపర్ స్టార్ మహేష్ కు స్పెషల్ విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan gave special wishes to Superstar Mahesh,

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలిసి మల్టీస్టారర్ వస్తే చూడాలని ఇరు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ప్రజంట్ టాలీవుడ్ లో వీరిద్దరికి బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. అభిమానుల ఆనంంద అంతులేనిది అవుతుంది. ఈరోజు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో పవన్ కళ్యాణ్ నుండి ఓ స్పెషల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

ఈ పోస్ట్ లో ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. ‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిదాం.

‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంధాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.” అని పవర్ స్టార్ పోస్ట్ చేశారు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.