సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ బెస్ట్ ఆప్షన్: చిరంజీవి

Pawan Kalyan Best Option in Siddha Role: Chiranjeevi,

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆచార్య సినిమా హవా సాగుతుంది. ఈ సినిమా మెగా అభిమానులకు మోస్ట్ అవైటెడ్ సినిమాగా మారింది. మూడేళ్లుగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు కలసి నటించిన భారీ ఎంటర్ టైనర్. ఆ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్దే నటించారు. ఈ సినిమాలో కథ కూడా కీలకంగా ఉంటుందనే విషయం ఇప్పటికే స్పష్టం అవుతుంది. ముఖ్యంగా ఆచార్య సినిమాలో ఆచార్య అనే పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. సిద్ధ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సిద్ధ పాత్ర కోసం రామ్ చరణ్ ను సెలెక్ట్ చేశారు. ఈ సాలిడ్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు కలిగాయి. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ ను ఏప్రిల్ 29 న ప్లాన్ చేశారు. దీంతో ప్రమోషన్ పనులు షురూ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ లు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సిద్ధ పాత్రకు ఒకవేళ రామ్ చరణ్ అందుబాటులో ఉండకపోతే ఆ పాత్రకు పవన్ కళ్యాణ్ అయితే సరిగ్గా సరిపోతారని చిరంజీవి అన్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగి ఉంటే.. ఆచార్య సినిమా వేరే లెవెల్ లో ఉండేదని మెగా అభిమానులు అంటున్నారు. మరికొంతమంది అయితే మెగాస్టార్, పవర్ స్టార్ విజువల్స్ ను ఊహించేసుకున్నారు కూడా. ఆచార్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో పాటు కొణిదెల ప్రొడక్షన్స్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విలన్ గా సోనూసూద్ నటిస్తున్నారు.