డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న పక్కా కమర్షియల్ మూవీ

Pakka Commercial Movie OTT Release,

హీరో గోపిచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా గత నెల జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ తో కమర్షియల్ హిట్ గా నిలిచి కలెక్షన్లు చేసింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందించారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తుండగా, ఆహా టీమ్ పక్కా కమర్షియల్ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇవాల్టీ నుండి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.

గోపిచంద్ ఈ మూవీలో లాయర్ పాత్రలో నటించి మెప్పించారు. దర్శకుడు మారుతి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను అందించారు. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మరో లాయర్ గా రాశి ఖన్నా నటించారు. ఇక హీరో తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించారు. విలన్ గా రావు రమేష్ యాక్ట్ చేశారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాతలుగా వర్క్ చేశారు. ఈ సినిమాలో శుభలేక సుధాకర్, సప్తగిరి, అజయ్ ఘోష్ లు మిగతా పాత్రల్లో నటించారు. మారుతి మార్క్ ఉన్న ఎంటర్ టైన్ మెంట్ ను అందించారు. మరి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, ప్రేక్షకులు విపరీతమైన ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ ఓటీటీ ట్రైలర్ కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.

గోపిచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీతో పాటు డిఫరెంట్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఈ సినిమాలో గోపిచంద్ కమర్షియల్ పాత్రలో నటించి మెప్పించారు. డబ్బు కోసం ఏమైనా చేసే లాయర్ పాత్రలో నటించగా, అతనికి ఎదురు వెళ్లే పాత్రలో సత్యరాజ్ నటించారు. ఇక విలన్ గా రావు రమేష్ యాక్టింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరి ఫైనల్ గా కమర్షియల్ హీరో ఎలా మారాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.