ది కశ్మీర్ ఫైల్స్ మూవీకి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

OTT streaming date fix for The Kashmir Files

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఆ తర్వాత ఈ మూవీకి మౌత్ పబ్లిసిటీ రావడంతో కశ్మీర్ ఫైల్స్ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఫస్ట్ డే తర్వాత కంటిన్యూగా పది రోజుల పాటు వసూళ్లు భారీగా పెరిగాయి. బడ్జెట్ కు పది రెట్లు లాభాలు వచ్చాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. థియేటర్ లో రీజనల్ లాంగ్వేజ్ లో చూడలేనివారు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లో చూడాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 13 న స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ జీ 5 లో ఈ సినిమాను హిందీతో పాటు సౌత్ ఇండియాన్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నుండి భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇక జీ 5 ఓటీటీ కి సౌత్ ఇండియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ ఉంది.

సౌత్ ఇండియాలో ఈ సినిమాను చూసేందుకు జీ 5 హోల్డర్స్ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఓటీటీలో కూడా సెన్సేషనల్ హిట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాలో ఏముందనే ఆసక్తి ఎక్కువైంది. ఈ క్రమంలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ఏది ఏమైనా ది కశ్మీర్ ఫైల్స్ మూవీ సెన్సేషనల్ హిట్ ను అందుకుని, చిన్న సినిమాలైనా.. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.