నాగచైతన్య థాంక్యూ మూవీ రివ్యూ

Naga Chaitanya Thank You Movie Review,

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ థ్యాంక్యూ. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే మనం సినిమా ప్రేక్షకుల్ని ఆదరించిన విషయం తెలిసిందే. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన థాంక్యూ మూవీ రివ్యూ ఎలా ఉందో చూసెద్దాం.

కథలోకి ఎంటర్ అయితే అభిరామ్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, పెరిగి.. తన కష్టంతోనే అమెరికా వరకు వస్తాడు. అక్కడ తన టాలెంట్ తో ప్రపంచంలోనే సక్సెస్ ఫుల్ కంపెనీని రన్ చేస్తాడు. తన సక్సెస్ కోసం ఏదైనా చేసే ప్రాసెస్ లో సెల్ఫిష్ మారతాడు. మళ్లీ తన జీవితాన్ని ఎఫెక్ట్ చేసిన మనుషుల్ని కలవాలనే ఉద్దేశ్యంతో మళ్లీ ఇండియాకి వెళ్తాడు. మరి ఆ తర్వాత హీరోకి ఎదురైన పరిస్థితులు ఏంటనేది తెలియాలంటే థాంక్యూ మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నాగచైతన్య యాక్టింగ్ ఈ మూవీకి బలంగా నిలిచింది. అతని లైఫ్ జర్నీతో పాటు ఎమోషనల్ ఫీలింగ్ క్యారీ చేయడం, ముఖ్యంగా మూడు డిఫరెంట్ షేడ్స్ లో నాగచైతన్య బాగా యాక్ట్ చేశారు.

విక్రమ్ కె కుమార్ పాయింట్, టేకింగ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హీరోయిన్ల పాత్రల వరకు రాశి ఖన్నా, మాళవిక, అవికా గోర్ లు ఆకట్టుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర కూడా ఎమోషనల్ గా సాగుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి సక్సెస్ వెనుక ఎంతోమంది పాత్ర కూడా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఉంటుందనే పాయింట్ ని డైరెక్టర్ చాలా డీసెంట్ గా తెరకెక్కించారు. ఈ మూవీకి మరో హైలెట్ మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటల్ని అందించారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే లో కొన్ని ఫ్లాప్స్ కనిపిస్తాయి.

ఇదొక వ్యక్తి జర్నీ అయినా.. లవ్ ట్రాక్ ని డెప్త్ యాంగిల్ లో చూపిస్తే బావుండేది. కొన్ని సీన్స్ అవసరం లేకపోయినా.. సాగదీతగా ఉంటాయి. సెకండాఫ్ కి వచ్చే సరికి ఎమోషనల్ సీన్స్ ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవుతారు. మెయిన్ క్యారెక్టర్ నాగచైతన్య తప్ప ఇంకెవ్వరూ డెప్త్ యాక్టివిటీ ఉండకపోవడం కూడా మైనస్ గా చెప్పొచ్చు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. పీసీ శ్రీరామ్ విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. థమన్ ఈ మూవీ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారనే చెప్పాలి. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాయి.

ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా ప్లాన్ చేశారు దిల్ రాజు. ఫైనల్ గా థాంక్యూ మూవీ ఓ ఫీల్ గుడ్ లైఫ్ జర్నీ. ఈ జర్నీలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు సీన్స్ ని ఇంకాస్త ఎఫెక్టివ్ గా డైరెక్ట్ చేస్తే బావుండేది. మొత్తానికి ఈ వీకెండ్ లో థాంక్యూ మూవీ ఎంజాయ్ చేయొచ్చు.