ఓటీటీలోకి సిద్ధం అయిన అక్కినేని నాగచైతన్య థ్యాంక్యూ

Naga Chaitanya Thank You Movie OTT Release Date,

టాలీవుడ్ అక్కినేని వారసుడు నాగచైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థ్యాంక్యూ. ఈ మూవీ థియేటర్స్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసేందుకు రెడీ అయ్యింది. కథలో ఫీల్ ఉన్నా, దాన్ని టేకింగ్ చేసే విధానంలో డైరెక్టర్ ఫెయిల్ కావడంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయలేకపోయింది. ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు. దీంతో అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా కాంబినేషన్ లో వచ్చిన థ్యాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

ఈ క్రమంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసి మంచి పేరును, వ్యూస్ ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంది. చాలా సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో వ్యూస్ పరంగా సక్సెస్ ను సాధిస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఫిల్మ్ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, ఈ మూవీ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ‘థ్యాంక్యూ’, ఓటీటీ ఆడియెన్స్‌ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

కాగా ఈ సినిమాలో నాగచైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్ లో నటించాడు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఓ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ను రీచ్ అయ్యేందుకు హీరో ఏం చేశాడు.. అలాగే తన జీవితంలో ఎదురైన పరిస్థితులు తనను ఎలాంటి పరిస్థిలకు తీసుకెళ్లాయనేది కథ. అలాగే తన సక్సెస్ కు కారణం అయిన వ్యక్తుల్ని హీరో కలిసి థ్యాంక్యూ ఎలా చెప్పాడు అనేది సినిమా స్టోరీ.