సంజయ్ లీలా భన్సాలీని కలిసిన నాగచైతన్య..

Naga Chaitanya meets Sanjay Leela Bhansali

అక్కినేని హీరో నాగచైతన్య రీసెంట్ గా నటించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా వచ్చే వారంలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబాయి వెళ్లిన నాగచైనత్య బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలిశారు. ప్రజంట్ ఓ మూవీతో బిజీగా ఉన్న సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా నాగచైతన్యను పిలిచి మాట్లాడబం అనేది చర్చలకు దారితీసింది. హందీలో నాగచైతన్య సెకండ్ లీడ్ గా కంటిన్యూ చేసే అవకాశాలున్నాయని, హీరోగా ఆఫర్ వచ్చినా.. మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాగచైతన్య గతంలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ కారణంగా సంజయ్ లీలా భన్సాలీ రీసెంట్ గా నాగచైతన్యతో మాట్లాడారేమో అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీకి విపరీతమైన క్రేజ్ ఉంది. భారీ సినిమాలను వరుసగా తీస్తున్న సంజయ్ లీలా భన్సాలీ డైరెక్టర్ లో నాగచైతన్య మూవీ వస్తే.. నాగచైతన్యకి ఇక బాలీవుడ్ లో తిరుగే ఉండదంటూ వార్తలు వస్తున్నాయి. మరి రీసెంట్ గా థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే లాల్ సింగ్ చద్దాపై నమ్మకం పెట్టుకున్నారు. మరోవైపు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నారు.

ఇక విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో దూత అనే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదే టైమ్ లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ థాంక్యూ ప్రభావం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పడకుండా చూసుకుంటున్నారట. అందుకే నెక్ట్స్ తాను సెలెక్ట్ చేసుకోబోయే సినిమాల కథల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారట.