మెగాస్టార్ లేటెస్ట్ ప్లాన్ అద్ధిరిందిగా!

Megastar New Movie Updates,

మెగాస్టార్ చిరంజీవి తన స్టైల్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్లాన్ తో సిద్ధం అవుతున్నారు. దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఇక నెక్ట్స్ మెగాస్టార్ నటించే సినిమాల విషయంలో సరికొత్త ప్లాన్ ను అమలు చేస్తున్నారు. ప్రాణం ఖరీదు మూవీ నుండి ఇప్పటివరకు ఎంతోమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసిన మెగాస్టార్ ఇక నుండి యంగ్ డైరెక్టర్స్ తోనే మూవీస్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఎన్నో సబ్జెక్ట్స్ ను పక్కన పెడుతున్నారు.

ప్రజంట్ మెగాస్టార్ చేతిలో వరుసగా మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లూసీఫర్ మూవీని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తమిళం డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెక్ట్స్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నారు. తమిళంలో హిట్ అయిన వేదాళంకు రీమేక్ గా భోళా శంకర్ రెడీ అవుతుంది.

ఈ మూవీలో చిరుకు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నారు. నెక్ట్స్ బాబీతో కలిసి వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో రవితేజ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. ఈ సినిమాల తర్వాత మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, మారుతిలతో కలిసి వర్క్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నయనతార నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రముఖ నటుడు సత్యదేవ్ నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ ఎస్ వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి లుక్ చాలా వైవిద్యంగా ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.