మాస్ మహారాజ్ రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ

Mass Maharaj Rama Rao On Duty Movie Review,

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శరత్ మండవ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా నేడు రిలీజ్ కాగా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

రామారావు ఓ నిజాయితీ ఉన్న ప్రభుత్వ అధికారి. తాను పనిచేసిన చోట జనం కోసం నిలబడి వాళ్ల కోసం ఉండే వ్యక్తి. ట్రాన్సఫర్ తో తాను పుట్టి పెరిగిన ఊరికి వెళ్లడం, తాను ప్రేమించిన మాలిని కష్టాల్లో ఉందని తెలుసుకుని కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆ ఊర్లో జరుగుతున్న కొన్ని అక్రమాలు తెలియడంతో రవితేజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది అసలు కథ. పర్ఫార్మెన్స్ ల విషయానికి వస్తే.. ఈ సినిమాలో రవితేజ, వేణు తొట్టెంపూడిల పాత్రలు హైలెట్. ఇక మిగతా క్యారెక్టర్లు వారి పరిధి మేరకు నటించారు. హీరోయిన్ల పాత్రలు కూడా అవసరానికి తగ్గట్లు ఉంటాయి తప్ప ప్రాధాన్యతకు చోటు లేదు.

ఇక డైరెక్టర్ శరత్ మండవ అనుకున్న పాయింట్ నీట్ గా ఉన్నా.. స్క్రీన్ ప్లే టేకింగ్ విషయంలో డ్రాప్ అయ్యాడనే చెప్పాలి. మాస్ మహారాజ్ రవితేజగా పేరున్న హీరోలో కథ ప్రకారం పాత్రలో జోష్ మిస్ అయ్యింది. మాస్ ఎలివేషన్స్ కు ఇంపార్టెన్స్ లేకపోవడంతో మరింత డల్ గా ఉంటుంది. ప్రభుత్వ అధికారి కావడం, ప్రజల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. రవితేజ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఆయనలోని మాసిజం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ మూవీలో రవితేజ మార్క్ మిస్ అయ్యింది. అయితే రవితేజను కొత్తగా చూద్దాంలే అనుకున్నా.. కథలో క్లారిటీ లాజిక్ రెండు మిస్ అవ్వడం, థ్రిల్లర్ మూవీకి ఉండాల్సిన క్వాలిటీస్ లేకపోవడంతో సినిమాపై ఇంట్రెస్ట్ కోల్పోతుంది.

ఇక కొన్ని సీన్స్ లో కాన్సెప్ట్ ని ఏమని అనుకున్నారో కూడా ప్రేక్షకుల్ని అర్థం కాదు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. సామ్ సీఎస్ ఈ మూవీకి అందించిన మ్యూజిక్ వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి. కానీ కొన్ని సీన్స్ కు బీజీఎం ఆకట్టుకోలేకపోతుంది. అయితే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకున్నాయి. ఫైనల్ గా రామారావు ఆన్ డ్యూటీ మిస్ ఫైర్ అయ్యిందా అనే సందేహం ప్రేక్షకుల్లో కలుగుతుంది.