మాచర్ల నియోజకవర్గం స్పెషల్ సాంగ్ కు స్పెషల్ రికార్డ్

Macherla Niyojakavargam Special Song Record,

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో హీరోయిన్లుగా కేథరన్ థ్రెస్సా, కృతి శెట్టిలు యాక్ట్ చేస్తున్నారు. ఈ సాలిడ్ మాస్ ఎంటర్ టైనర్ ను డైరెక్టర్ ఏ ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్ గా ట్రైలర్ తో మూవీపై అంచనాలు పెంచింది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ప్రోమోస్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రా రా రెడ్డి సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ఈ సాంగ్ కు యూట్యూబ్ సహా అన్ని సోషల్ మీడియాలో 500 మిలియన్ వ్యూస్ తో బిగ్గెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ సాంగ్ కు లాస్ట్ లో నితిన్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ జయం నుండి రాను రాను అంటూనే చిన్నది లిరిక్ ను రీమిక్స్ చేసి పెట్టారు. దీంతో ఆడియన్స్ తో పాటు నితిన్ అభిమానుల్లో ఈ సాంగ్ కు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఈ మూవీకి మహతి సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో మాచర్ల నియోజకవర్గం సినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా బిగ్గెస్ట్ రెస్పాన్స్ దక్కింది. పైగా ఈ మూవీలో నితిన్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాలు ఆశించినంతగా కమర్షియల్ హిట్ ను సాధించుకోలేకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటివరకు ఈ మూవీ నుండి రిలీజ్ సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ దక్కుతుంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్ట్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే.