సెన్సార్ ను కంప్లీట్ చేసుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’

Macherla Niyojakavargam Completed Censor,

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 12 న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా, యూఏ సర్టిఫికేట్ ను అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ మూవీ ప్రమోషన్ పనుల్లో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి హైప్ ను అందుకుంది. గత కొన్నాళ్లుగా నితిన్ కు హిట్స్ లేకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేయనున్నారు. మాచర్ల నియోజకవర్గంలో తన బాధ్యతల్ని నిర్వర్తించే పాత్రలో అలరించనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఫిల్మ్ టీమ్ గ్రాండ్ గా అలరించింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లకు, పాటలకు, వీడియోలకు ప్రేక్షకుల నుండి భారీ క్రేజ్ దక్కింది.

అంజలి నటించిన స్పెషల్ సాంగ్ తో పాటు హీరో హీరోయిన్ల పోరీ సూపరో అనే సాంగ్ కు భారీ క్రేజ్ వచ్చింది. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నితిన్ సందడి చేశారు. ఆయన స్టెప్పులతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. ఎమ్ ఎస్ రాజశేఖర్ డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలాగే ఈ మూవీలో నితిన్ ఎలివేషన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా భారీగా ప్లాన్ చేశారు.