సెన్సార్ పూర్తి చేసుకున్న ‘లైగర్’ మూవీ

Liger movie has completed the sensor,

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లైగర్. ఈ సినిమా ఆగస్ట్ 25 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరో 20 రోజుల్లో థియేటర్ లోకి రానున్న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సినిమాకు ప్రమోషనల్ పరంగా ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పనుల్ని పూర్తి చేసుకుందని ఫిల్మ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు విజయ్ డాన్సులు కూడా అద్దరగొట్టారట. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ మార్క్ క్లియర్ గా ఉంటుందని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక విజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, మేకోవర్ ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. కాగా ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో కీ రోల్ లో రమ్యకృష్ణ యాక్ట్ చేస్తుండగా, ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు తల్లీ, కొడుకుల మధ్య సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందని పూరీ జగన్నాథ్ అంటున్నారు. మరోపక్క విజయ్, అనన్య పాండే లవ్ ట్రాక్ కూడా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో కష్టపడుతున్నారు. అలాగే ఈ సినిమాలో విజయ్ కు ఓ ప్రత్యేకమైన ఆటిట్యూడ్ ఉంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది.