డీ గ్లామర్ పాత్రలో అద్దరగొడుతున్న కీర్తి సురేష్ ‘చిన్ని’ ట్రైలర్

Keerthy Suresh Chinni Movie Trailer Talk,

విలక్షణ నటిగా కీర్తి సురేష్ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. మహానటి మూవీతో నేషనల్ అవార్డ్ ను అందుకున్న ఆమె నెక్ట్స్ పాత్రలు కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ నటిస్తున్న తమిళ సినిమా సన్నికాయిధం. డైరెక్టర్ సెల్వరాఘవన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాకు డైరెక్షన్ వహించారు.

తెలుగులో కూడా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. చిన్ని అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ గ్రామీణ మహిళగా నటిస్తున్నారు. పగప్రతీకారాలతో రగిలిపోతూ వరుసగా అత్యంత కిరాతంగా హత్యలు చేసే యువతి పాత్రలో కీర్తి నటించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మే 6 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది. అత్యంత దారుణంగా 24 మందిని హత్య చేసిన రంగయ్య, చిన్నిలు పోలీసులకు పట్టుబడి, విచారణ చేస్తారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకున్న చిన్ని జీవితంలో రేగిన అలజడి ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కుంది. మరి చిన్నికి చినగంజాంకు చెందిన రంగయ్య ఎందుకు సాయం చేశారు.

రంగయ్య పాత్రలో సెల్వరాఘవన్ నటించారు. చిన్ని పాత్రలో కీర్తి సురేష్ డీ గ్లామర్ రోల్ లో యాక్ట్ చేసారు. ప్రస్తుతం చిన్ని ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె హావాభావాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ సినిమాతో మరోసారి కీర్తి సురేష్ ప్రశంసలు దక్కించుకోవడం ఖాయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మే 6 న చిన్ని సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.