కార్తీక్, కియారాల ‘భూల్ భులైయా పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్

Kartik Kiara Bhool Bhulaiyaa Part 2 Trailer Release,

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించి భూల్ భులైయాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పార్ట్ 2 మూవీలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కియారా, టబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన భూల్ భులైయా 2 మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే నెల 20 న థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది.

స్టార్ నటీనటులు ఉన్నా ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ లో ఎంట్రీ ఇస్తే.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎవరో ఆ తలుపు తట్టారు. ఆ తలుపు వెనుక ఉంది సాధారణ ఆత్మ కాదు.. చేతబడి తెలిసిన మంజులికా.. అని టబు డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అన్ని హారర్ మూవీస్ తరహాలోనే ఈ ట్రైలర్ ఉంది. హాంటెండ్ హావేలీలో దెయ్యాన్ని వదిలించడానికి వచ్చిన రూహా బాబా పాత్రలో కార్తిక్ ఆర్యన్ కనిపిస్తున్నారు. అక్కడ కియారా ప్రేమలో పడుతుంది. ఇక ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక, వారి జీవితాల్లోకి ఎలాంటి సిట్యూవేషన్స్ ఎదురయ్యానేది అసలు కథ. మరి ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మిగాతా హరర్ ప్రేమికులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ఫస్ట్ పార్ట్ లో ఉన్న రాజ్ పాల్ యాదవ్ ను ఈ పార్ట్ లో కూడా చూడొచ్చు. హరే రామ్ హరే కృష్ణ అనే సాంగ్ ను కూడా ఇందులో రీమిక్స్ చేశారు. ఈ సినిమాలో కామెడీ యాంగిల్ తో పాటు హరర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ కు ప్రియదర్శన్ డైరెక్షన్ వహించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ ను అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తుండగా, ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తున్నారు.