కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ రివ్యూ

Kalyan Ram Bimbisara Movie Review,

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా బింబిసార మూవీ హల్ చల్ చేస్తుంది. నేడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బింబిసార మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథలోకి ఎంటర్ అయితే బింబిసారుడు త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. జాలి, దయ లేకుండా పలు రాజ్యాలను సొంతం చేసుకుంటాడు. బింబిసార అనుకోకుండా ఓ శాపానికి గురై టైమ్ ట్రావెల్ చేసి ప్రస్తుతానికి వస్తాడు. ఆయన గతం నుండి ఆధునిక యుగానికి వచ్చిన బింబిసార ఎలా ఉన్నాడు. ఫైనల్ గా బింబిసార తన శాపానికి విముక్తుడు అయ్యాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ డైరెక్టర్ వశిష్ట్ టేకింగ్, అలాగే హీరో కళ్యాణ్ రామ్. ఎవరి ఊహలకు అందని రీతిలో డైరెక్టర్ పాయింట్ ముందుగా నచ్చుతుంది. అలాగే బింబిసార పాత్రకు సరిగ్గా కళ్యాణ్ రామ్ సరిపోయారు. ఈ సినిమాతో ఆయన హిట్ అందుకున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తన యాక్టింగ్ ఎమోషన్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. కళ్యాణ్ రామ్ పాత్రకు తగ్గట్టు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేంజ్ అద్భుతం.

ఇక క్యాథరిన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. ఇక విజువల్స్, యాక్షన్, మ్యూజిక్ తో మూవీకి మరింత స్పెషాలిటీ అందుకుంది. థ్రిల్లింగ్ అంశాలు కూడా ప్రేక్షకుల్ని మరింత ఎంటర్ టైన్ చేస్తాయి. ఈ సినిమాలో మైనస్ పాయింట్ అంటే సెకండ్ హాఫ్ లో కాస్త స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. మూవీకి కావాల్సిన ఎఫెక్టివ్ విజువల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ప్రతి ఫ్రేమ్ ఆడియన్స్ ను ఖచ్చితంగా అలరిస్తాయి. ఫైనల్ గా చెప్పాలంటే బింబిసార సినిమా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మూవీగా ఉంది.