సౌత్ ఇండియా సినిమా అవకాశాలు వస్తే.. అస్సలు వదులుకోను అంటున్న జాన్వీ

Janhvi says that if South Indian film opportunities come,

జాన్వీ కపూర్.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ క్రేజ్ ఉన్న హీరోయిన్. శ్రీదేవి కూతురిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది. ఆమె ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. అప్పట్నుండి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్ తల్లి చేసిన పాత్రలను తాను చేసే సాససం చేయలేనని అన్నారు. తన తల్లి ప్రతి సినిమాలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారని, అలా తాను చేయడం సాధ్యం కాదని అన్నారు. అయితే సౌత్ ఇండియా మూవీస్ చేయడానికి తాను ఎప్పుడూ వెయిటింగ్ అని మంచి ఆఫర్స్ వస్తే.. అస్సలు మిస్ చేసుకోను అని జాన్వీ అన్నారు.

’తెలుగు సినిమాలో గానీ ఏదైనా సౌత్‌ ఇండియా మూవీలో గానీ నటించాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉందని అన్నారు. అందులోనూ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదని ఆయనొక లెజెండ్‌.. అయితే మీరనుకుంటున్నట్లుగా ఎన్టీఆర్‌తో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ ఆయనతో కలిసి పని చేయడానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి చెక్‌ పడినట్లైంది. అయితే రామ్ చరణ్ తో కూడా నటించే ఛాన్స్ ఉందని రూమర్స్ వచ్చాయి.

ఈ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని అర్థమవుతుంది. కానీ తెలుగులో ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని రీసెంట్ గా ఆమె తెలిపింది. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే ఆమె తల్లి శ్రీదేవి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తానని జాన్వీ అన్నారు.