మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియాకు సిద్ధం అవుతున్నారా?

Is Megastar Chiranjeevi preparing for Pan India,

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలవలేకపోయింది. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై రెడీ అవుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ లో గాడ్ ఫాదర్. ఈ సినిమా మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తుంది.

మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ కు అధికారిక తెలుగు రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది. ఈ సినిమాను విజయదశమికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి సినీ కెరీర్ లో 153 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఇండియా వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే మలయాళ రీమేక్ కావడంతో మలయాళం కాకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు కనుక హిందీ మార్కెట్ పై కూడా ఫుల్ ఫోకస్ చేశారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆచార్య సినిమా హిందీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తెలుగులో డిజాస్టర్ గా మారడంతో ఆ ఆలోచనను మానుకున్నారు. ఇక నెక్ట్స్ రిలీజ్ అవ్వబోయే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే గాడ్ ఫాదర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. లూసిఫర్ అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సినిమాను రీమేక్ చేయడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడం కరెక్టెనా.. అనే కామెంట్స్ వస్తున్నాయి.