ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్

Interesting buzz on the movie Aa Ammayi Gurinchi Meeku Cheppali,

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఎంతో మంది డైరెక్టర్లలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం సుధీర్ బాబుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నిజానికి వీరిద్దరి కాంబోలో మూవీస్ చాలా స్పెషల్. గతంలో సమ్మోహనం, వి లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. కాగా ఇప్పుడు వచ్చే సినిమా కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా నిలవనుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ తో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్నారు.

ప్రజంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఫిల్మ్ టీమ్ అప్డేట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఓ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ చుట్టూ తిరిగే కథతో సినిమా తీద్దామని అనుకుంటున్నా అని హీరో చెప్పడం, హీరోయిన్ అదే స్టైల్ లో ఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. కృతి శెట్టి మరోసారి తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

ఆగస్ట్ 10 వ తేదీ ఉదయం 11 గంటలకు సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ను ఇవ్వనున్నారు. అంటే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనే విషయంలో అఫిషియల్ డేట్ ను ప్రకటిస్తున్నారని స్పష్టం అవుతుంది. కాగా ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేకపోయినా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పైగా ఈ సారి ఈ మూవీ హిట్ పక్కా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.