500 థియేటర్లలో గాంధీ సినిమాలు.. పూర్తిగా ఉచితం

Gandhi movies in 500 theaters completely free,

భారతదేశానికి 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసింది. నేడు దాదాపు 500 థియేటర్లలో మార్నింగ్ షోగా విద్యార్థులతో దేశభక్తిని పెంపొందించాలని మహాత్మాగాంధీ జీవిత చరిత్రను ప్రజంట్ చేశారు. ఈ షో దాదాపు 15 రోజులు కొనసాగుతుందని తెలిసింది. జాతిపిత గాంధీ అహింస నినాదంతో భారత దేశ స్వాతంత్య్ర సమరంలో పోరాడిన నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు.

దేశవ్యాప్తంగా గాంధీజీ జీవిత చరిత్రపై ఎన్నో సినిమాలు ఆకట్టుకున్నాయి. గాంధీ- గాంధీ మై ఫాదర్- ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ- ది గాంధీ మర్డర్- హమ్ నే గాంధీకో మార్ దియా- నాను గాంధీ- హే రామ్ .. ఇలా ఎన్నో సినిమాల్లో గాంధీజీ పాత్రలను దర్శకులు ఎంతో హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు. అవన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రీసెంట్ గా ‘ది బిగ్ బుల్’ ఫేం ప్రతీక్ మహాత్మా గాంధీ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ’పై రెండు పుస్తకాల హక్కులను అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్ భారీ మొత్తాన్ని అందించి ఈ పుస్తకాల ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.

గాంధీజీ ప్రారంభ రోజుల నుండి దక్షిణాఫ్రికాలో ఆయన చేసిన పనులు, అలాగే భారతదేశంలోని స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాల్ని రూపొందిస్తున్నారు. అతని జీవితంలో అంతగా తెలియని కథలను ఈ సిరీస్ తెరపై చూడొచ్చని దర్శకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. నిజానికి మహాత్మ గాంధీజీపై నేటితరానికి తెలిసింది చాలా తక్కువ. పుస్తకాలు చదివే అలవాటు అంతరించిన ఈ యుగంలో.. విజువల్ మీడియంపై ఆధారపడుతున్న నేటి జనరేషన్ కి ఇలాంటి సిరీస్ లు సినిమాలు చాలా ముఖ్యం అనే విషయం స్పష్టం చేస్తున్నారు.