ఆర్ఆర్ఆర్ నుండి ‘ఎత్తర జెండా’ ఫుల్ వీడియో సాంగ్

Ethara Jenda Full Video Song from RRR,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ ను అందుకుంది. నెల రోజులు పూర్తయినా.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని వీడియో సాంగ్స్ ను ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేస్తుంది. రీసెంట్ గా ఎత్తర జెండా అనే ప్రమోషనల్ సాంగ్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ డాన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో ఒలివియా మోరీస్, అజయ్ దేవగణ్, రాజమౌళిలు కూడా కనిపిస్తారు. కీరవాణి అందించిన ట్యూన్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్ ను అందించగా, సాహితి చాగంటి, పృథ్వీ చంద్ర, విశాల్ మిశ్రా, హారికా నారాయణ్ కలిసి పాడారు. ఈ సాంగ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది.

రీసెంట్ గా నాటు నాటు, కొమ్మా ఉయ్యాల, దోస్తి పాటలు అలరించాయి. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లు నటించారు. ఈ పాత్రలకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇక రాజమౌళి టేకింగ్ తో మరోసారి వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా 1000 కోట్ల క్లబ్ లోకి కూడా ఆర్ఆర్ఆర్ మూవీ చేరి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆదరణ చూపించారు.