టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ శంకర్ కూతురు?

Director Shankar daughter who will enter Tollywood,

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సినీ ఇండస్ట్రీలోకి ఆయన కూతురు అదితి శంకర్ సింగర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి నటిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా నటిస్తున్న విరుమన్ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అదితి హీరోయిన్ గా ఫస్ట్ టైమ్ ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే హీరో కార్తి నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అవుతుంటాయి. పైగా ఈ మూవీ ట్రైలర్ ను తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్ట్ 12 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో శంకర్ కూతురు అదితి శంకర్ పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా అదితి శంకర్ నటిస్తున్న సెకండ్ సినిమా మావీరన్. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి శంకర్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. మొడొన్నే అశ్విన్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాకు భరత్ శంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక అదితి శంకర్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగులో ఓ ప్రముఖ బ్యానర్ తో సినిమాకు సైన్ చేశారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో చెప్తామని అన్నారు. ఆమె టాలీవుడ్ ఎంట్రీ పట్ల అటు కోలీవుడ్ ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. ఇప్పటికే శంకర్ కూతురు గని సినిమాలో ఓ సాంగ్ తో సింగర్ గా ఎంటర్ టైన్ చేశారు.