‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను కలిసిన దిల్ రాజు

Dil Raju met the President of Maa Association,

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియక పలు ఇబ్బందులకు గురవుతుంది. రీసెంట్ గా ఆగస్ట్ 1 నుండి షూటింగ్ లు బంద్ అని అధికారికంగా ప్రకటించారు. అలాగే బడ్జెట్ తో పాటు ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుతో పాటు మరికొంతమంది టాలీవుడ్ ప్రొడ్యూసర్ లు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణును కలిశారు.

మా అసోసియేషన్ లోకి మరింత మందికి కొత్త సభ్యుల్ని చేర్చడానికి కొత్త వాళ్లను ఆదరించేందుకు వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నట్లుగా మంచు విష్ణు, ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా మంచు విష్ణు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అయ్యాయరు. జిన్నా, ఢీ డబుల్ డోస్ లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక దిల్ రాజు సైతం తన భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. విజయ్ దళపతి హీరోగా ద్విభాషా చిత్రంగా వారసుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా నిలిచిపోవడంతో.. ఈ మూవీ తమిళం సినిమానే అని తెలుగులోకి డబ్ అవుతుందని షూటింగ్ కు బ్రేక్ లేకుండా చేశారు. కాగా నిన్న మొన్నటి వరకు వారసుడు మూవీ డైరెక్ట్ తెలుగు సినిమా అని ప్రచారం సాగింది.

ఇక ఈ సినిమాతో పాటు టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ తో వస్తున్న సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ఆయన సినీ కెరీర్ లో 50 వ ప్రాజెక్ట్ గా వస్తుంది. ఈ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాలను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.