ధనుష్ నటించిన ‘ది గ్రే మ్యాన్’ మూవీ రివ్యూ

Dhanush The Gray Man Movie Review,

హాలీవుడ్ సినిమాలు ఇండియన్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. భారతీయ నటులు హాలీవుడ్ మూవీస్ లో నటించడం కూడా చాలా అరుదైన విషయం. ప్రముఖ రూసో బ్రదర్స్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది గ్రే మ్యాన్. మార్క్ గ్రీని రాసిన నావెల్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ధనుష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీలో ధనుష్ ఎలా నటించారు. రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కథలోకి ఎంటర్ అయితే చిన్నతనం నుండి ఎన్నో ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసిన సిక్స్ ను సియారా ప్రోగ్రామ్ లోకి సీఐఏ ఏజెంట్ గా తీసుకుంటారు. ఈ క్రమంలో సిక్స్ ఓ పెన్ డ్రైవ్ ని కనిపెడతాడు. అందులో ఎన్నో చీకటి కోణాలు మరెన్నో సీఐఏకు సంబంధించిన కీ పాయింట్స్ ఉంటాయి. వాటిని దక్కించుకోవాలని లాయిడ్ హాన్సన్ ట్రై చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే సిక్స్ ను చంపి పెన్ డ్రైవ్ ను తీసుకురావడానికి కిల్లర్స్ ను పంపుతాడు. మరి ఈ నేపథ్యంలో సిక్స్ తప్పించుకున్నాడా లేదా.. ఈ స్టోరీలోకి అవిక్ సాన్ ధనుష్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ది గ్రే మ్యాన్ మూవీ చూడాల్సిందే. రుసో బ్రదర్స్ తెరకెక్కించిన సినిమా అంటే అద్భుతమైన గ్రాఫిక్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో మూవీస్ తెరకెక్కిస్తారు.

ఈ కథలో యాక్షన్ కు మాత్రమే పరిమితం చేసినట్లుంటుంది. అయితే కాగా హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ కూడా గ్రిప్పింగ్ గా ఉండవు. అవిక్ సాన్ పాత్రలో ధనుష్ యాక్టింగ్, ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సిక్స్ పాత్రలో రేయాన్ గాస్లింగ్ అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్ లో ది బెస్ట్ అనిపించుకున్నారు. లాయిడ్ హాన్సన్ గా కెప్టెన్ అమెరికాలో నటించిన క్రిస్ ఇవాన్స్ యాక్టింగ్ బావుంది.

ఇక ధనుష్ కిరాయి హంతకుల్లో ఒకరిగా యాక్ట్ చేశారు. ఆయన యాక్షన్ సీన్స్ వైల్డ్ గా, ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. టెక్నికల్ గా కూడా సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. హెన్రీ జాక్ మెన్ మ్యూజిక్ తో ఆకట్టకున్నారు. ఫైనల్ గా ది గ్రే మ్యాన్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించి మెప్పించడం గర్వకారణం.