ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో హీరో ధనుష్..

Dhanush is the hero in the role of a food delivery boy,

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ స్టార్ క్రేజ్ మూవీ తెరకెక్కించి, వెంటనే చిన్న సినిమాను తెరకెక్కించడం ధనుష్ కే సాధ్యం. ఆయన సెలెక్ట్ చేసుకునే పాత్రలు ప్రేక్షకుల్ని షాక్ తో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆయన హోదాను పక్కన పెట్టి మరీ పాత్రకు ప్రాణం పోస్తాడు. అందుకే ఆయనంటే ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.

ఇక రీసెంట్ గా ధనుష్ ఓ డెలివరీ బాయ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తిరుచిత్రాంబళం అనే మూవీలో ధనుష్ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశికన్నాలు నటిస్తున్నారు. మిత్రన్ జవహార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్ రీసెంట్ గా ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో నటించారు. ఇందులో ఆయనది సినిమాకు కీలక పాత్ర.

ఇక ప్రజంట్ నటిస్తున్న సినిమాలో డైరెక్టర్ భారతి రాజా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ తండ్రిగా పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. ఈ సినిమాను ఆగస్ట్ 18 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక తెలుగలో ధనుష్ సార్ అనే డైరెక్ట్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో తెలుగులోనూ ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.