సర్కారు వారి పాట నుండి మాస్ సాంగ్ కి డేట్ ఫిక్స్

Date Fixed for Sarkaru Vaari Paata Mass Song,

మహేష్ బాబు హీరో గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయినా సాంగ్స్ సోషల్ మీడియా లో రికార్డ్స్ ను సృష్టించాయి. అయితే తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలను పెంచేసింది. మహేష్ ఫాన్స్ అయితే సినిమా రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం పక్క అని ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ మే 12 న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అయితే డైలీ ఈ సినిమా కు సంబందించిన ఎదో ఒక్క అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్లో జోష్ పెంచుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కు సంబంధించి మాస్ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఈ సాంగ్ సంబందించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

అయితే మే 7 న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ పాట ని రిలీజ్ చేస్తామని చెప్పారు చిత్ర యూనిట్, ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మే 7 వరకు వెయిట్ చెయ్యాలి . ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో పటు జీఎంబీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.