నాగార్జున ఘోస్ట్ పై క్రేజీ అప్డేట్ రివీల్

Crazy update reveal on Nagarjuna Ghost,

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, నాగార్జునతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఘోస్ట్ అనే టైటిల్ తో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతుంది. నాగార్జున యాక్షన్ మూవీతో హిట్ అందుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఘోస్ట్ మూవీలో నాగార్జునను డైరెక్టర్ పవర్ ఫుల్ గా ప్రజంట్ చేస్తున్నారు. నాగార్జున ఫ్యాన్స్ కు ఈ సినిమా ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్టేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. కిల్లింగ్ మెషీన్ ఘోస్ట్ ను అక్టోబర్ 5 న రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు.

ఈ సినిమా టీజర్ లోనూ నాగార్జున చాలా పవర్ ఫుల్ గా కనిపించారు. ఈ మూవీకి భరత్ సౌరభ్ ద్వయం మ్యూజిక్ అందిస్తున్నారు. నాగార్జునకు జోడీగా ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేశారు. కాగా రీసెంట్ గా మరో క్రేజీ అప్డేట్ ను రివీల్ చేశారు. ఈ మూవీ నుండి ఓ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేయగా, ఈ పోస్టర్ లో కత్తిపై నాగార్జున ఉన్నారు.

ఈ అప్డేట్ ను ఆగస్ట్ 18 న రిలీజ్ చేస్తామని ఉదయం 10 గంటల 8 నిమిషాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. మరి ఈ క్రేజీ అప్డేట్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలకు భారీ స్పందన వచ్చింది. అలాగే ప్రవీణ్ సత్తారు టేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుందనే విషయం తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.