బాలకృష్ణతో కళ్యాణ్ రామ్ సినిమాపై పక్కా క్లారిటీ!

Clarity on Kalyan Ram movie with Balakrishna,

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ బింబిసార. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ నాన్ స్టాప్ గా ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా టీమ్ అంతా ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. రీసెంట్ గా ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ కూడా వచ్చి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. సినీ ప్రేక్షకులు కూడా బింబిసార సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా సంయుక్త మీనన్, కేథరిన్ థ్రెస్సాలు నటిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీగా బింబిసార రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా, యాంకర్ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు.

కళ్యాణ్ రామ్, భవిష్యత్ లో బాలయ్య, ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేస్తారా అని అడగ్గా.. బాబాయ్ కు ఓ కథ వినిపించానని, కానీ అది ఆయనకు నచ్చలేదని, కానీ బాబాయ్ కు నచ్చే కథతో ఖచ్చితంగా తన నిర్మాణంలో ఓ మంచి సినిమా తీసుకువస్తానని అన్నారు. అలాగే ఎన్టీఆర్ తో కలిసి ఓ పాన్ ఇండియాలో నటిస్తానని, ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్లానింగ్ లో ఉన్నాయని త్వరలోనే క్లియర్ అప్డేట్ ఇస్తానని కళ్యాణ్ రామ్ అనడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపినట్లయ్యింది. మరి ఈ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూడాలి.