బింబిసార పాన్ ఇండియా వార్తపై క్లారిటీ

Clarity on Bimbisara pan India news,

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి రిలీజ్ అవ్వబోయే సినిమాలపై ఫోకస్ చేశారు ప్రేక్షకులు. ఇక ఈ మధ్యకాలంలో చూసుకుంటే టాలీవుడ్ నుండి వస్తున్న సినిమాల పరిస్థితి కూడా దీనంగా ఉంది. కంటెంట్, నరేషన్ సినిమాల్లో కనిపించకపోవడంతో ఆడియన్స్ మార్నింగ్ షో తర్వాత నుండి థియేటర్స్ కు రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో చూడొచ్చు కదా అనే ఫీలింగ్ తో ఉంటున్నారు. మరి ఇలాంటి సిట్యూవేషన్స్ లో ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించడం అంటే మాటలు కాదు.

ఇక రీసెంట్ టైమ్ లో హై బడ్జెట్ మూవీస్ పై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో బింబిసార మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ట డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వస్తున్న పీరియాడికల్ కమ్ మోడ్రన్ డ్రామా. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందని ఓ టాక్ కూడా వైరల్ అయ్యింది. అయితే లాస్ట్ కి ఈ సినిమా రిలీజ్ కు ఇప్పటికే ఫిల్మ్ మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు.

తెలుగులో తాను అనుకున్న రీతిలో సినిమా హిట్ అయ్యితే.. ఆగస్ట్ మూడో వారంలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను డబ్ చేస్తామని అన్నారు. మరి ఈ విషయంలో ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా భారీ సెట్టింగుల్లో షూటింగ్ జరుపుకుంది. హీరోయిన్లుగా కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ లు నటిస్తున్నారు. బింబిసార టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పట్ల హీరో కళ్యాణ్ రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ కూడా వచ్చి మరింత ప్రమోట్ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.