బింబిసార ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ

Clarity on Bimbisara OTT release,

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సినిమా బింబిసార. ఈ సినిమా ఆగస్ట్ 5 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర అద్దిరిపోయే సక్సెస్ ను అందుకుంది. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఫిల్మ్ టీమ్ పార్టిసిపేట్ చేసింది. ఈ మీట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఉన్నారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుందని, ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ థియేటర్స్ కు వస్తున్నారని అన్నారు. దీంతో కళ్యాణ్ రామ్ సినిమాకు, నటనకు మంచి స్కోప్ ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ సినిమా కథ అద్భుతం అనే చెప్ాపలి. ఈ సినిమా ప్రజంట్ అన్ని థియేటర్స్ లో నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. ఈ మీట్ లో దిల్ రాజు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బింబిసార, సీతారామం చిత్రాలు టాలీవుడ్‌కు బూస్ట్‌ని ఇచ్చాయని.. ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ తిరిగి సక్సెస్ బాట పట్టిందని ఆయన అన్నారు. ఇక బింబిసార మూవీ యాక్టర్స్, టెక్నీషియన్స్ పడ్డ కష్టానికి, ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కాగా, ఈ క్రమంలోనే బింబిసార సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా ఓటీటీలో 50 రోజుల తరువాతే స్ట్రీమింగ్ అవుతుందని, ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి వస్తున్నారని.. వారికి థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను దూరం చేయడం ఇష్టం లేదని ఆయన తెలిపారు. బింబిసార టోటల్ థియేట్రికల్ రన్ తరువాతే ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఆయన అన్నారు. దీంతో ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీకి రాదనే క్లారిటీ వచ్చింది. కాగా బింబిసార సినిమా నాన్ స్టాప్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. అయితే ఇదే స్పీడ్ లో ఈ సినిమా పార్ట్ 2 ను కూడా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతుంది.