ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న చంద్రముఖి 2

Chandramukhi 2 completed the first schedule,

కోలీవుడ్ డైరెక్టర్ పి వాసు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ చంద్రముఖి 2. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ కోలీవుడ్ బడా ప్రొడ్యూసర్ లైకా సంస్థ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్, యాక్టర్ గా ఉన్న రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసే ముందు రజనీకాంత్ ఆశీస్సులతో స్టార్ట్ చేశారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రివీల్ చేశారు.

చంద్రముఖి 2 మూవీ మైసూర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఈ వీడియోను రిలీజ్ చేయగా.. మూవీ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అయిన లుక్ తో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఫస్ట్ పార్ట్ లో రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక కామెడీ యాంగిల్ లో నవ్వించిన వడివేలు పార్ట్ 2 లోనూ ఉన్నారు. ఇక చంద్రముఖి 2 లో లక్ష్మీ మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

పార్ట్ 1 తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2 ను కూడా అదే రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. అలాగే ఈ పార్ట్ 2 మరింత హారర్ కమ్ కామెడీగా తెరకెక్కిస్తున్నారనే సంగతి గతంలో ఫిల్మ్ టీమ్ తెలిపింది.