మహేష్ బాబుకు తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో?

Bollywood senior hero in the role of Mahesh Babu father,

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్ బాబు ప్రస్తుతం పెట్లా పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, మే 12 న ప్రపంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ పనుల్ని కూడా షురూ చేశారు. ఇక మహేష్ బాబు ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో మెస్మరైజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా షురూ చేశారు.

త్రివిక్రమ్ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ షురూ చేశారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రను బాలీవుడ సీనియర్ నటుడు చేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఈ సినిమాలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఫిల్మ్ టీమ్ ప్లాన్ చేస్తుంది.

ఫస్ట్ మహేష్ బాబు పై సోలో సాంగ్ తో పాటు ఓ ఫైట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ లో సినిమాలో కీలక భాగాల్ని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా కథ ఉంటుందనే విషయంలో త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది. ఈ మూవీ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారు.