బిగ్ బాస్ 6 ప్రోమో రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున

Bigg Boss 6 promo released by King Nagarjuna,

టాలీవుడ్ బుల్లితెరపై నాన్ స్టాప్ ఎంటర్ టైనింగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో విషయంలో ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా.. టీఆర్పీ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే డైలీ ఎపిసోడ్స్ ను ప్రేక్షకులు మిస్ అవ్వరు. తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరవ సీజన్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వడంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున హెస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అతి త్వరలో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టార్ట్ అవ్వనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ప్రోమోలో కొత్త పెళ్లికూతురు అప్పగింతల్లో ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న తల్లి మొబైల్ కు ఓ మెసేజ్ వస్తుంది. పెళ్లికొడుకు తరఫు వాళ్లంతా మాయం అవ్వగా, మై డియర్ అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తారు. బ్యాక్ గ్రౌండ్ లో బిగ్ బాస్ థీమ్ వస్తుంది. అప్పగింతల వరకు ఆగలేకపోతున్నారంటే.. ఆట మొదలైనట్లే.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే.. ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డా ఫిక్స్.. అని నాగార్జున్ చెప్తారు. ‘

లైఫ్ లో ఏ క్షణం అయినా బిగ్ బాస్ తరువాతే! ఫుల్ ఫన్ అండ్ ఎమోషన్స్ తో మరో వినోదాత్మక సీజన్ తో తిరిగి వస్తున్నాం. స్టార్ మా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో #BiggBossTelugu6 రాబోతోంది” అని నాగార్జున ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఐదు సీజన్స్ లో నాగార్జున వరుసగా మూడు సీజన్లకు హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. ఇక హౌస్ లో నాగార్జున కంటెస్టెంట్స్ ని చాలా బాగా డీల్ చేస్తారు. దీంతో ఆడియన్స్ కూడా నాగ్ స్టైల్ కి ఫిదా అయ్యారు.