హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ బజ్!

Big announcement buzz from the Hombale Films banner,

పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తున్న ప్రొడక్షన్ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఈ బ్యానర్ లో రీసెంట్ గా కేజీఎఫ్ పార్ట్ 2 ను తెరకెక్కించారు. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించి బిగ్గెస్ట్ హిట్ ను నమోదు చేసింది. ఈ సినిమా సక్సెస్ తో వీరి బ్యానర్ పేరు దేశవ్యాప్తంగా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఈ బ్యానర్ లోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ కూడా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదికగా ఈ బ్యానర్ నుండి మరో బిగ్ క్రేజీ అనౌన్స్ మెంట్ ను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సిల్వర్ స్క్రీన్ పై ఓ కొత్త అధ్యాయం అంటూ ఏప్రిల్ 27 ఉదయం 9 గంటల 50 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో సినీ అభిమానుల్లో ఈ బిగ్ అనౌన్స్ మెంట్ ఏమై ఉంటుందా అని తెగ ఆరాటపడుతున్నారు. మరి ఈ సాలిడ్ అనౌన్స్ మెంట్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సింది.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసిన కేజీఎఫ్ చాప్టర్ 2 సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ టీమ్ కేజీఎఫ్ 1000 కోట్ల సెలెబ్రేషన్ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో యశ్ యాక్టింగ్ పీక్స్ కు చేరుకుంది. ఈ పార్ట్ 2 తో యశ్ కు మరింత క్రేజ్ దక్కింది. ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్ కూడా అద్భుత ఘట్టం అనే చెప్పుకోవాలి. మరి వీరిద్దరి కృషికి బడ్జెట్ లో ఎక్కడా, దేనికీ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పేరు సైతం మార్మోగిపోతుంది.