దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాకు బెస్ట్ రివ్యూ

Best review for Dulquer Salmaan Sita Ramam movie

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రీసెంట్ లవ్ డ్రామా సీతారామం. ఈ సినిమా ఆగస్ట్ 5 న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో రష్మిక మందన్న నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఇంట్రెస్టింగ్ బజ్ ను క్రియేట్ చేశారు.

ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోసం లో పోస్ట్ ప్రొడక్షన్ విభాగాధిపతి శ్రీ సివి రావు కూడా రీసెంట్ గా ఈమూవీని చూసి రివ్యూ ఇచ్చారు.

ఆయన ఇచ్చిన రివ్యూ ప్రకారం.. కాలానుగుణంగా వచ్చిన బెస్ట్ మూవీస్ లో సీతారామం కూడా ఒకటి అన్నారు. ఈ సినిమాకు రైటింగ్స్, స్క్రీన్ ప్లే, టేకింగ్, డైరెక్షన్, హీరోహీరోయిన్లు తమ బెస్ట్ ఇచ్చారని అన్నారు. ఇక ప్రతి ఫ్రేమ్ లో టెక్నిషియన్లు అందించిన వర్క్ కనిపిస్తుందని సివి రావు అన్నారు. సీతారామం సినిమా బిగ్ స్క్రీన్స్ పై చూడాలని అన్నారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రల్లో సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాతో ఓ మంచి లవ్ స్టోరీ ప్రేక్షకులకు అందించవచ్చని డైరెక్టర్ హను రాఘవపూడి అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సినిమా ఇంటర్వ్యూల్లో కూడా ఫిల్మ్ టీమ్ మూవీపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఫీలింగ్ ను కలిగిస్తుందో తెలియాలి.